పారడైజ్ పేపర్స్ : జగన్ కి షాక్..పాదయాత్ర అడుగుపడగానే పేరు బయటకు..!

Monday, November 6th, 2017, 11:55:57 PM IST

జగన్ సంకల్పించిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించగానే జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పారడైజ్ పేపర్స్ లీకేజి వ్యవహారంలో జగన్ పేరు కూడా బయటకు వచ్చింది. ప్రపంచ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు ఈ పారడైజ్ పేపర్ల పేరిట టాక్స్ లు కట్టకుండా డబ్బు కూడబెట్టుకున్న ప్రముఖుల పేర్లని బయట పెట్టింది.

పాదయాత్ర ప్రారంభించిన రోజున జగన్ అవినీతి కేసుల గురించి ప్రస్తావన రావడం ఆ పార్టీకి బాంబు లాంటి వార్తే. జగన్ ఆర్థిక వ్యవహారాలు, కేసుల గురించి ఈ పేపర్స్ లో ప్రస్తావనకు వచ్చాయి. కానీ జగన్ పేరు నామమాత్రంగానే వచ్చిందని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసిపి నేతలు కొందరు చెబుతున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే అమితాబ్ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తుండగా.. కేరళ ముఖ్యమంత్రి పునరాయ్ విజయన్ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. సచిన్ పైలట్, కార్తీ చిదంబరం పేర్లు కూడా ఉండడం విశేషం. సన్ టివి, హిందుజా, జిందాల్ స్టీల్, జి ఎం ఆర్ గ్రూప్స్ వంటి సంస్థల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

Comments