పాదయాత్రలో ఫస్ట్ స్టెప్..జగన్ అసలు ఉద్దేశం వీడియోలో..!

Monday, November 6th, 2017, 08:45:46 AM IST

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్పం పేరుతో చేపడుతున్న పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇడుపుల పాయ నుంచి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర దాదాపు ఆరు నెలల పాటు 13 జిల్లాలు, 125 నియోజకవర్గాలని చుట్టేలా ప్లాన్ చేసారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా 2019 ఎన్నికలని జగన్ టార్గెట్ చేసారు. అందులో భాగంగానే పాదయాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఇడుపులపాయలో ఉదయం 9 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న జగన్ అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు. వేంపల్లి వరకు జగన్ నేటి పాదయాత్ర సాగనుంది. పాదయాత్రతో పాటుగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. పాదయాత్ర ఉద్దేశాన్ని తెలుపుతూ జగన్ తన పేస్ బుక్ లో జగన్ స్పీక్స్ పేరుతో వీడియోని విడుదల చేశారు.

జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రతి నియోజక వర్గంలోనూ వైసిపి ఇంచార్జులు ఆయన బాబాగోగుల కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హామీల వైఫల్యం, ప్రజలకోసం తానేమి చేయబోతున్నానో వివరించడం.. ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా జగన్ పాదయాత్ర సాగనుంది. మరోవైపు టీడీపీ నుంచి కూడా జగన్ పాదయాత్రపై తీవ్రమైన విమర్శల దాడి మొదలైంది. జగన్ తన అక్రమ ఆస్తుల లెక్క చెప్పి పాదయాత్ర ప్రారంభించాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో వైపు పాదయాత్ర చేయడంలో తప్పులేదని, కానీ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడం ఏంటనే విమర్శలు వై ఎస్ సన్నిహితుడిగా భావిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేశారు. వైసిపి వర్గాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్.. రాజకీయ వర్గాల్లో పొలిటికల్ హీట్ నెలకొని ఉన్న నేపథ్యంలో జగన్ తన పాదయాత్రలో ఫస్ట్ స్టెప్ వేయనున్నారు. ఇది ఎలాంటి రాజకీయ మార్పులని తీసుకుని వస్తుందో చూడాలంటె పాదయాత్ర ముగిసే వరకు వేచి చూడాలి.

ఇదిలా ఉండగా గతంలో పాదయాత్రలు చేయడం ఎపి రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు, గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాదయాత్రల ద్వారానే అధికారంలోకి వచ్చారు. కాగా జగన్ సోదరి వై ఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేపట్టడం విశేషం. తాజాగా జగన్ పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ఆయనకు కలసి వచ్చే అంశమే అనేది విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ తన పాదయాత్ర గురించి వివరిస్తున్న వీడియోని ఈ క్రింద చూడొచ్చు..

  •  
  •  
  •  
  •  

Comments