పాదయాత్రతో రికార్డ్ సృష్టించనున్న జగన్!

Sunday, May 13th, 2018, 11:37:32 PM IST

రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికి వైసిపి అధినేత జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఓ వైపు ప్రత్యేక హోదా విషయంపై ప్రణాళికలు రచిస్తునే ప్రజాయాత్రను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అదే విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా జగన్ తన పాదయాత్రలో తెలుగు దేశం పార్టీపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక త్వరలోనే పాదయాత్రతో జగన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయనున్నాడు.

ఇప్పటికే 1700 కిలో మీటర్లకు పైగా ప్రజాయాత్రతో ముందుకు సాగిన జగన్ మరికొన్ని రోజుల్లో 2000 కిలోమీటర్లు నడిచిన నేతగా రికార్డ్ సృష్టించబోతున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్ ఆ జిల్లాలో ఉన్న 13 నియోజక వర్గాల్లో 250 కిలో మీటర్ల మేరకు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో జరగబోయే పాదయాత్రతో జగన్ 2000 km మార్క్ ను అందుకోనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments