జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇస్తాడా.. కొన‌సాగిస్తాడా.. మీరేమ‌నుకుంటున్నారు..?

Friday, October 26th, 2018, 06:03:09 PM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా దాడి జ‌రిగిన సంగతి తెలిసందే. అయితే దాడి అనంత‌రం హైద‌రాబాద్ సిటీ న్యూరో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకున్న జ‌గ‌న్ ఈ రోజు మ‌ధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. అయితే దాడిలో భుజానికి లోతుగా గాయం అయ్యిందని.. దీంతో తొమ్మిది కుట్లు వేశామ‌ని.. క‌త్తి బాగా లోతుగా దిగ‌డంతో గాయం మాన‌డానికి కొన్ని రోజులు ప‌డుతాయ‌ని అప్ప‌టి వ‌ర‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని జ‌గ‌న్‌కు వైద్యం చేసిన డాక్ట‌ర్లు సూచించిన సంగ‌తి తెలిసిందే.

అయితే జ‌గ‌న్ పాద‌యాత్రం చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టిస్తార‌ని వైసీపీ శ్రేణులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ విశ్రాంతి తీసుకుంటాడా లేక పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తాడా అనే చ‌ర్చ‌చు రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌ల‌య్యాయి. అయితే చాలా మొండోడు అని.. ఇచ్చిన మాట త‌ప్ప‌డ‌మే కాదు, మొద‌లు పెట్టిన ప‌నిని పూర్తి చేయ‌డానికి ఎంత దూరం అయినా వెళ‌తాడ‌ని.. దీంతో త‌న‌కు ఏమ‌వుతుందో అన్న భ‌యంతో జ‌గ‌న్ ఇంట్లో కూర్చోడ‌ని.. ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ చాలా త‌క్కువే అని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ న‌డిచే మార్గంలో దుమ్ము దూళీ కారణంగా జ‌గ‌న్‌కు అయిన గాయానికి ఇన్ఫెక్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని అందుకే కొద్ది రోజ‌లు రెస్ట్ తీసుకుంటే మంచిద‌ని డాక్ట‌ర్లు సూచించారు. మ‌రి జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇస్తాడో.. కొన‌సాగిస్తాడో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే.