ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్ – పవన్లు రహస్య సమావేశం..?

Monday, November 12th, 2018, 01:07:31 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వ‌రకు ఏపీలో టీడీపీ – వైసీపీల మ‌ధ్యే ప్రధాన పోటీ అనుకుంటే, ఇప్పుడు తాజాగా జ‌న‌సేన వ‌చ్చి ర‌చ్చ లేపుతోంది. 2019 ఎన్నిక‌ల రేసులోకి జ‌న‌సేన వ‌చ్చాక అక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో మార్పు వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఒక‌ వార్త సెన్షేష‌న్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ మీడియా ముందు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి.

ఇక‌ అస‌లు మ్యాటర్ ఏంటంటే ఇటీవ‌ల్ వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం అయ్యార‌ని చెప్పి ఒక్క‌సారిగా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌నులు సృష్టిస్తున్నాయి. ఇటీవ‌ల పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో వ‌ట్టి ర‌వి ఇంట్లో జ‌గ‌న్ – ప‌వ‌న్‌లు క‌లిసారని.. ఆ స‌మావేశంలో సీట్ల గురించి కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. అందులో భాగంగా జ‌గ‌న్ ప‌వ‌న్‌కు కొన్ని సీట్లు ఆఫ‌ర్ చేశార‌ని.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అంటూ సీయం కుర్చీ పై క‌న్నేసిన ప‌వ‌న్.. జ‌గ‌న్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను ఒప్పుకోలేద‌ని.. సీట్లు స‌ర్ధుబాటు కాక వైసీపీ-జ‌న‌సేన పొత్తు కుద‌ర‌లేద‌ని కారెం శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఈ స‌మాచారం త‌న‌కు ఎలా తెలిసింది.. ఎక్క‌డి నుండి వ‌చ్చిందనే విష‌యం మాత్రం చెప్ప‌లేదు కారెం శివాజీ. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియ‌దు కానీ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.