జ‌గ‌న్ – ప‌వ‌న్‌ల మ‌ధ్య 40 సీట్ల డీల్.. ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు..?

Tuesday, November 20th, 2018, 11:45:35 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో ర‌హ‌స్యంగా క‌లిసార‌ని, అయితే చ‌ర్చ‌లో భాగంగా సీట్ల వ్య‌వ‌హారం స‌ర్ధుబాటు కాక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య పొత్తు కుద‌ర‌లేద‌ని, కొద్ది రోజుల క్రితం ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌ప‌ట్నంలో వ‌ట్టి ర‌వి ఇంట్లో ఈ ఇద్ద‌రు క‌లిశార‌ని.. ఆ మీటింగ్‌లో భాగంగా జ‌గ‌న్, ప‌వ‌న్‌కు 40 సీట్లు ఆఫ‌ర్ చేశాడ‌ని.. అయితే అప్ప‌టికే ముఖ్య‌మంత్రి పీఠం క‌న్నేసిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించార‌ని శివాజీ చెప్పారు.

అయితే తాజాగా టీడీపీ నేత క‌ళా వెంక‌ట‌రావు స్పందిస్తూ.. విశాఖపట్నంలో యలమంచిలి రవి ఇంట్లో జగన్‌తో పవన్ కళ్యాణ్ రహస్యంగా సమావేశం అయ్యారని.. అందులో భాగంగా ప‌వ‌న్ రాబోయే ఎన్నికల్లో 40 సీట్లు కావాలని జగన్‌ను కోరిన మాట నిజ‌మో కాదో చెప్పాల‌ని టీడీపీ మంత్రి క‌ళావెంట‌రావు డిమాండ్ చేశారు. అయితే ఈ ఇద్ద‌రి టీడీపీ నేత‌ల మాట‌ల‌కు పొంత‌నే లేదు. ఒక‌రేమో జ‌గ‌న్ ఆఫ‌ర్ చేశాడ‌ని అంటున్నారు.. మ‌రొక‌రేమో ప‌వ‌న్ అడిగార‌ని చెబుతున్నారు. అసలు జ‌గ‌న్ – ప‌వ‌న్‌లు సీక్రెట్‌గా క‌లిస్తే.. ఈ టీడీపీ నేత‌ల‌కు ఎలా తెలిసింది. ఇదే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న నేప‌ధ్యంలో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. మ‌రోవైపు పాద‌యాత్ర‌తో జ‌గ‌న్ దూసుకుపోగా, జ‌న‌సేన యాత్ర‌త‌దో ప‌వ‌న్ హాంగామా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విష‌ప్ర‌చారానికి తెర‌లేపారు చంద్ర‌బాబు. అందులో భాంగాగానే జ‌గ‌న్-ప‌వ‌న్ మ‌ధ్య 40 సీట్ల డీల్ అని టీడీపీనే ఫిక్స్ చేసి.. వైసీపీ-జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని ప్ర‌జ‌ల్లో అయోమ‌యం సృష్టించ‌డానికి ప్లాన్ వేసింది టీడీపీ. అంతే కాకుండా ఈ ఇద్ద‌రు మోదీ గూటి ప‌క్షులే అని విష‌ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టింది టీడీపీ.

ఒక‌వేళ నిజంగానే మోదీ,జ‌గ‌న్,ప‌వ‌న్‌లు క‌లిస్తే త‌ప్పేంటి.. చంద్ర‌బాబు మాత్రం త‌న సొంత రాజ‌కీయాల అవ‌స‌రం కోసం ఎవ‌రితోనైనా క‌ల‌ల‌వ‌చ్చు, ఇత‌ర పార్టీలు మాత్రం క‌ల‌వ కూడ‌దా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ ఓడిపోతామ‌ని చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్‌కి ఇప్ప‌టికే అర్ధ‌మైన‌ట్టుంది.. అందుకే త‌న ఎల్లో మీడియాతో విష‌ప్ర‌చారానికి పూనుకున్నాడు చంద్ర‌బాబు. దీంతో జ‌గ‌న్-ప‌వ‌న్ 40 సీట్ల డీల్ టీడీపీ విష‌ప్ర‌చారం త‌ప్పా.. ఆ వార్త‌లో నిజం లేద‌ని.. చంద్ర‌బాబు త‌న ఉనికి కాపాడుకోవ‌డానికి ఎంత‌కైనా తెగిస్తార‌ని.. అందులో భాగంగానే టీడీపీ నేత‌ల‌తో, ఇలా ప్ర‌చారం చేయిస్తూ.. తాను లాంభం పొందేందుకు ప్ర‌యత్నిస్తున్నాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.