వివేకా హత్యోదంతం : కార్యకర్తలను వారించిన జగన్

Saturday, March 16th, 2019, 04:01:47 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి మీద హత్య చేయడం వల్లనే మరణించాడని మనకి ఇది వరకే తెలిసింది కానీ ఈ హత్యని రూపుమాపుదామని కొందరు నాయకులు చూస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. కాగా తన వివేకానంద రెడ్డిని హత్య చేయడం అతి నీచమైన పని జగన్ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా చాలా చరిత్ర కలిగి ఉండి, ఎంతో సౌమ్యుడిగా పేరు తెచుకున్నటువంటి వివేకానందరెడ్డి ని అతి దారుణంగా చంపడం నీచమైన చర్య. దీనికి కారణమైన వారెవరిని వదిలేది లేదని జగన్ ఆగ్రహించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చిన్నాన్నను హత్య చేసి, సహజ మరణంగా చిత్రీకరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ అన్నారు. తలపై ఐదు చోట్ల గొడ్డలితో నరికారని తెలిపారు.

తన చిన్నాన్న మృతదేహానికి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్… అభిమానులు ఆవేశానికి లోను కావొద్దని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘మనకు దేవుడు ఉన్నాడు. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. అన్యాయం చేసినోళ్లను ఆయన చూస్తాడు.. వైఎస్సార్ అభిమానులకు మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఘటన ద్వారా రెచ్చిపోయి ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నా..’ అని జగన్ పిలుపునిచ్చారు..