ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని నా చేతికిచ్చింది: జగన్‌

Wednesday, May 9th, 2018, 07:07:25 AM IST


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రతో జనాలను బాగానే ఆకర్షిస్తున్నారు. నిర్వహిస్తున్న ప్రచారాల్లో జనాలు భారీ సంఖ్యలో తరలివస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీల తప్పులను ప్రజలకు తెలియజేస్తూ కౌంటర్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓటు వైఎస్సార్ పార్టీకే వేయాలనే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా జగన తన క్రేజ్ ను కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన పోస్ట్ చేసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక చిన్నారి రాసిన లేక అంటూ జగన్ అందుకు సంబందించిన ఫొటోను పోస్ట్ చేశారు. స్వాగతం సుస్వాగతం జగనన్నకి… మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. మా ఇల్లు పూరిల్లు. పూరిళ్లని డాబాలు చేయమని కోరుకుంటున్నాం. రూ.2000 పింఛన్‌ వృద్ధులకు ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నాం.. మీ అమ్మగారిని కూడా బాగా చూడమని కోరుకుంటున్నా’ అని ఇవాళ పాదయాత్రలో 5వ తరగతి చదువుతున్న ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని నా చేతికిచ్చింది’ అని తెలిపారుల. ప్రస్తుతం జగన్ పాతయాత్ర కృష్ణ జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.