చంద్రబాబు ని ప్రశ్నించిన జగన్ – మరీ ఇంత ఘాటుగానా…?

Saturday, May 18th, 2019, 12:00:08 AM IST

ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రోజులు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలకి స్పందించిన వైసీపీ అధినేత జగన్, చంద్రబాబు పై వరుస ప్రశ్నల వర్షం కురిపించారు… అయితే చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించాలి అనుకున్న ఈసీ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పు పడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సీఈసీ సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం వారు కూడా టీడీపీ పై వివక్ష చూపుతున్నారని, కేవలం వైసీపీ వారు ఫిర్యాదు చేసిన పోలింగ్ బూత్ లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించారని, కానీ టీడీపీ ఫిర్యాదు చేసిన కేంద్రాలని కనీసం కూడా పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు. కాగా ఈ విషయం పై స్పందించిన జగన్ చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురిపించారు…

‘చంద్రబాబు నాయుడు గారూ రీ పోలింగ్ అప్రజాస్వామికమా?, లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయనివ్వకుండా వారి ఓట్లు మీరు వేయడం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడటమా? రీ పోలింగ్ అంటే మీకుందుకు జంకు? అయిదు పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.

అయితే తాము విజయం సాధిస్తామని వస్తున్నటువంటిని వార్తలని జీర్ణం చేసుకోలేకపోతున్నా చంద్రబాబు కావాలనే ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, అధికారులని, ప్రజలను మభ్యపెట్టి దారి మళ్లిస్తున్నాడని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు… కాగా మే 23న రానున్నటువంటి ఎన్నికల ఫలితాలలో వైసీపీ విజయం సాదించనుందని, తమ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు…