టిడిపికి బిగ్ షాక్..బిజెపితో పొత్తుకు జగన్ గ్రీన్ సిగ్నల్..?

Tuesday, January 23rd, 2018, 03:48:48 AM IST

ఈ ఏడాది మొత్తం రాజకీయ నేతలు ఎత్తులు పై ఎత్తులతో దేశవ్యాప్తంగా పొలిటికల్ హంగామా చోటు చేసుకోనుంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం వేడిక్కినట్లు కనిపిస్తోంది. ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్ ఇటీవల 900 కిమీ యాత్రని పూర్తి చేసారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆ మద్యన నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కి మద్దత్తు ఇచ్చారు. దీనిపై టిడిపి భగ్గుమంది. జగన్ మోడీతో రాజీ కుదుర్చుకున్నారని ఆరోపించింది. ఆ సమయంలో ఏపీ బిజెపి నేతలు జగన్ కు అండగా నిలిచారు.

దీనితో జగన్, బిజెపి మధ్య పొత్తు ఆలోచనలు చిగురిస్తునట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. బిజెపి వైసిపి పొత్తు దిశగా జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూ లో జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరో ఆలోచన లేకుండా వారితో కలసి ఎన్నికలకు వెళతామని అన్నారు. అంటే జగన్ మనసులో బిజెపి పొత్తు ఆలోచనలు ఉన్నట్లు స్పష్టం అయిపోయింది. బిజెపి వైపు నుంచి సానుకూల స్పందన వస్తే టీడీపీకి షాక్ తగలడం ఖాయం అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.