పవన్ పెళ్లిళ్లపై జగన్ కామెంట్!

Wednesday, July 25th, 2018, 03:40:04 AM IST


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ రాష్ట్రం విషయమై జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై మీడియాతో ముచ్చటించారు. రాజకీయాలు పూర్తిగా విలువలు లేనివిగా తయారయ్యాయని, నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుతింటున్న టిడిపి ఇప్పుడు నిద్ర లేచి రాష్ట్రానికి హోదా కావాలి అంటూ విడ్డూరంగా మాట్లాడుతోందని ఎద్దేవా చేసారు. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో బీజేపీ వారితో జతకట్టినపుడు రాష్ట్రానికి హోదా తెస్తామన్నారు, అలానే విభజన హామీల విషయమై హామీ తీసుకున్నారు. చివరికి ప్రజలకు అబద్దాలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని, దర్జాగా నాలుగేళ్ళ పాటు ప్రజల పరిస్థితి పూర్తిగా గాలికి వదిలేసి, కేవలం తన కుమారుడికి, తన అనునాయులకు మాత్రం న్యాయం చేసుకుంటూ వస్తున్నారు అని మండిపడ్డారు. నాలుగేళ్లపాటు కాలం గడిపారని, ఏనాడూ కూడా టీడీపీ కానీ, చంద్రబాబు కానీ విలువలు గల రాజకీయం చేయలేదని, అందుకే రాష్ట్రానికి ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని నిందిస్తున్నారు. ఆయనకు విలువల గురించి మాట్లాడే అర్హత లేదని, మనం కార్లు మార్చినట్లు ఆయన భార్యలను మారుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ నోటివెంట రాజకీయాలు మాట్లాడం, అది మనం వినడం నిజంగా మన ఖర్మ అని అన్నారు. గత ఎన్నికల సమయంలో మీరే కదా చంద్రబాబు గారు ఎంతో అనుభవజ్ఞులు, అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని ఆయన ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఆ తరువాత మెల్లగా ఎలాగో నాలుగేళ్లు గడిపారు. మళ్ళి ప్లేట్ మార్చి ఇప్పుడేమో చంద్రబాబు, మరియు టీడీపీ అవినీతితో కూరుకుపోయాయి అని మీరే అంటున్నారు. అసలు మీకు విలువలు అనేవి ఉన్నాయా అని ప్రశ్నించారు. ఓవైపు చంద్రబాబుని నిందిస్తూనే, మరోవైపు పరోక్షంగా ఆ పార్టీకి మద్దతిస్తున్నారని విమర్శించారు. అటువంటి మీరు ఇకనైనా విలువలెరిగి రాజకీయాలు మాట్లాడండి అని హితవు పలికారు….

  •  
  •  
  •  
  •  

Comments