2019 బిగ్ ఫైట్.. తూర్పుగోదావరి జిల్లాలో.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Thursday, November 1st, 2018, 01:30:47 PM IST

ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి మైద‌లైంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌ధ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో భాగంగా జిల్లాల‌న్నీ చుట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల్లోని నియోజ‌క వ‌ర్గాల్లో ప‌ట్టు ఉన్న నేత‌ల్ని ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో ఇంచార్జులుగా నియ‌మిస్తూ వ‌స్తున్నాడు జ‌గ‌న్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికే టిక్కెట్లు కేటాయించ‌డం ఖాయ‌మ‌నే టాక్ కూడా వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే గోదావ‌రి జ‌ల్లాలు జ‌గ‌న్‌కు గ‌ట్టిగానే షాక్ ఇచ్చాయి. దీంతో ఆ జిల్లాల పై ఎక్కువ ఫోక‌స్ పెట్టాడు జ‌గ‌న్. ఈ క్ర‌మంలోనే తూ.గో.జీలోని పెద్దాపురం నియోజ‌కవ‌ర్గంలో ఓ ఎన్నారైని రంగంలోకి దించాడు జ‌గ‌న్. పెద్దాపురం పార్టీకోఆర్డినేట‌ర్‌గా కొన‌సాగుతున్న తోట సుబ్బారావునాయుడును త‌ప్పించి.. ఆయ‌న స్థానంలో ఎన్ఆర్ఐ ద‌వులూరి దొర‌బాబును ఆ నియోజ‌క వ‌ర్గంలో పార్టీకోఆర్డినేట‌ర్‌గా నియ‌మిస్తూ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీస‌కున్నాడు.

అయితే తొలుత అక్క‌డ జ‌గ‌న్ నిర్ణ‌యంతో కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. దొర‌బాబు దూసుకుపోతున్న విధానం చూశాక, వైసీపీ శ్రేణులు ప్ర‌స్తుతం స‌ర్దుకుపోయి, దొర‌బాబుతో క‌లిసిపోయార‌ని స‌మాచారం. దొర‌బాబు నిత్యం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో ముందుంటున్నాడు. ఈ క్ర‌మంలో అక్క‌డ నీటి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల దాహార్తి తీర్చ‌డానికి వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను సైతం ఏర్పాటు చేసి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మంచి మార్కులు వేయంచుకున్నాడు. ఇక ఆర్ధికంగానూ తిరుగులేని దొర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితాలు రాబ‌డ‌తాడో చూడాలని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments