బిగ్ బ్రేకింగ్ న్యూస్.. వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్…!

Thursday, October 25th, 2018, 05:11:51 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం ఏపీలో క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పాద‌యాత్ర ముగించుకుని హైద‌రాబాద్ వెళ్ళేందుకు విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో వెయిట్ చేస్తుండ‌గా.. సెల్ఫీకోస‌మ‌ని వ‌చ్చి క‌త్తితో జగ‌న్ పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యి తృటిలో ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నా.. దాడిలో భాగంగా అత‌ని భుజానికి గాయమైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈదాడితో రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపుతుండ‌గా.. వైసీపీ శ్రేణులు ఆందోళ‌ణ చెందుతున్నారు.

ఇక దాడి అనంత‌రం హైద‌రాబాద్ చేరుకున్న జ‌గ‌న్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఈ రోజు నాపై దాడి జ‌రిగింది. నేను పెద్ద ప్ర‌మాధం నుండి త‌ప్పించుకున్నాను.. నా కోసం ఆందోళ‌న చెందుతున్న ప్ర‌తి ఒక్క‌రికి నేను క్షేమంగా ఉన్నాన‌ని తెలియ‌జేస్తున్నాను. పైనున్న ఆ దేవుడి ద‌య‌.. తెలుగు ప్ర‌జ‌ల ఆశీస్సుల‌, ప్రేమ నేడు ప్ర‌మాధం నుండి ర‌క్షించాయి.. ఇకముందు కూడా ర‌క్షిస్తాయని న‌మ్ముతున్నారు. ఇలాంటి పిరికి చ‌ర్య‌లు త‌న‌నేమి చేయ‌లేవ‌ని.. ఇలాంటి చ‌ర్య‌లకు తాను భ‌య‌ప‌డ‌నని.. ఇంకా ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఇంకా బ‌లంగా పోరాడుతాన‌ని జ‌గ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్టు చేశారు. ఇక దాడి నుండి జ‌గ‌న్ త‌ప్పించుకున్నా జ‌గ‌న్ అభినులు మాత్రం ఆందోళ‌న చెందుతున్నారు. ఇక‌ మ‌రోవైపు రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను ఎదుర్కొన‌లేక ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నాని వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments