వైఎస్ జగన్ సంచ‌ల‌నం.. కంటతడి పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..!

Tuesday, November 20th, 2018, 05:50:19 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్రం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం త‌క్కువ ఉండ‌డంతో జ‌గ‌న్ త‌న వ్యూహాల‌కు కూడా ప‌దును పెడుతూ.. ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను సెట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక త‌న‌పై దాడి జరిగిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ ఏమాత్రం దూకుడు త‌గ్గించకుండా పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే జ‌డ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా కుర‌పాం నియోజకవర్గంలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో తాజాగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొంటున్నా.. మ‌రోవైపు టీడీపీ నుండి ఒత్తిళ్ళు వ‌చ్చినా.. చిన్న‌వారైనా పుష్ప శ్రీవాణి, ఆమె భ‌ర్త ప‌రీక్షిత్ రాజు ఎలాంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా విలువ‌ల‌తో కూడిని రాజ‌కీయం చేశార‌ని.. దీంతో ఈ ఇద్ద‌రు త‌న మన‌సులో ఎప్ప‌టికీ నిల‌చిపోతార‌ని జ‌గ‌న్ అన్నారు. దీంతో జ‌గ‌న్ మాట‌ల‌కి భావోద్వేగానికి గురైన పుష్ప శ్రీవాణి బ‌హిరంగ స‌భ‌లోనే కంట‌త‌డి పెట్టారు.