బాబు ఒక్కో ఓటుకి 3000..జగన్ సంచలనం.!

Tuesday, February 12th, 2019, 02:34:17 AM IST

ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే నోట్ల కట్టల ప్రవాహం ఉప్పొంగుతుందన్న సంగతి తెలిసిందే..ఈ సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలకు కూడా ధన ప్రవాహం తప్పక ఉంటుంది.రాయితీ ఈ ఎన్నికలకు గాను ఎలా అయినా సరే గెలవడానికి చంద్రబాబు ఎన్ని రకాల వ్యూహాలైనా వేస్తారని వాటికి ఎవరు మోసపోవద్దని ఈ రోజు అనంతపురంలోని జరిగినటువంటి సమర శంఖారావం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతీ ఓటరుని డబ్బులతో కొనెయ్యాలని చూస్తున్నారని,అందుకనే ప్రతీ ఒక్క ఓటుకి మూడు వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసారు.ఇప్పుడు మూడు వేలు తీసుకొని మోసపోకండి,రేపు నేను ముఖ్యమంత్రి అయ్యాక అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రతీ విద్యార్థిని పంపిన తల్లికి 15వేల రూపాయలు ఇస్తానని జగన్ తెలిపారు.అందుకని ఏ ఒక్కరు బాబు ఇచ్చే 3 వేల రూపాయలకి ప్రలోభపడవద్దు అని ఆ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసారు.