శుక్రవారం బ్రేక్ లో పిఎం వద్దకు జగన్..పక్కాగా అందుకే..?

Thursday, February 1st, 2018, 03:50:03 AM IST

గత సార్వత్రిక ఎన్నికలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ అలయన్స్ తో దెబ్బతిన్న జగన్ ఈ సారి మాత్రం అలాంటి పొరపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని వేగంగా పావులు కదుపుతున్నాడు. ఓ వైపు పాదయాత్ర చేస్తూనే అమలు చేయాల్సిన రాజకీయ వ్యూహాలపై కన్నేశాడు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే ప్రధానిని ప్రసన్నం చేసుకున్న జగన్ మరో మారు ఢిల్లీ టూర్ వేసి మోడీని దర్శించుకోవడానికి సిద్ధం అవుతున్నాడని టాక్. ఢిల్లీలోని వైసిపి నేతలు మోడీ అపాయింట్ మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ్రైడే రోజు మోడీతో జగన్ మీట్ అయ్యేలా లాబీయింగ్ చేస్తున్నారట. ప్రతి శుక్రవారం జగన్ పాదయాత్ర నుంచి బ్రేక్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో మోడీని కలసి 2019 ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన పొత్తు గురించి చర్చించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా ఆ మధ్యన బిజెపితో పొత్తుకు రెడీ అంటూ జాతీయ మీడియా ద్వారా మోడీకి జగన్ సంకేతం పంపారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న జగన్ కుదిరితే ప్రి అలయన్స్ లేకపోతే పోస్ట్ అలయన్స్ కు మోడీని కన్విన్స్ చేయాలని జగన్ భావిస్తున్నారు.

నేరుగా పొత్తుల గురించి మాట్లాడేందుకు వెళుతున్నట్లు తెలిస్తే బ్యాడై పోయే ప్రమాదం ఉంది కనుక, ప్రత్యేక హోదా మరియు నిధుల గురించి అడిగేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు వైసిపి వర్గాలు లీకులు ఇస్తున్నాయి. జగన్ ఢిల్లీ టూర్ పై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. మోడీ అపాయింట్ మెంట్ దొరికాక దీని గురించి ప్రకటన రావొచ్చు. టీడీపీ, బిజెపి మధ్య చీలిక మొదలైన నేపథ్యంలో ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు జగన్ కు సలహా ఇచ్చారట.