జగన్ షాకింగ్ ట్విస్ట్ – ఆ నిర్ణయం తీసుకొని మంచి పనే చేశాను…

Thursday, March 14th, 2019, 11:44:51 AM IST

నేడు కొద్దీ సేపటి క్రితం వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీలి చెందిన ముఖ్యనేతలతో తన స్వగృహంలో సమావేశమయ్యారు. పార్టీ కి మరియు ఎన్నికలకు సంబందించిన కొన్ని కీలక నిర్ణయాల కోసం చర్చించారని సమాచారం. రానున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన కొన్ని కీలక నిర్ణయాలు కూడా కొలిక్కూ వచ్చాయని సమాచారం. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు జగన్‌తో సమావేశమయ్యారు. జాబితా విడుదల చేయడం ఆపేసి మంచి నిర్ణయమే తీసుకున్నారని జగన్ తో పార్టీ నేతలు అన్నారు.

ఒకవేళ నిన్న జాబితా ప్రకటన చేసి ఉంటే ఆంధ్రాలో పోటీ చేసే వారి లిస్ట్‌ను తెలంగాణలో ప్రకటించారని అధికార పార్టీ నుండి చాలా విమర్శలు వచ్చేవని, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ నేతలు లేనిపోని విమర్శలు చేసేవారని అన్నారు. అందుకోసమనే చివరి నిముషంలో జాబితాను ఆపేశారని సమాచారం. ‘అయినా… ఇంకా కొంత మంది నేతలు పార్టీలో చేరబోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపికను నిర్ణయించాలని, ఇక అన్ని కలిపి ఈ నెల 16న విడుదల చేయనున్నారని జగన్ అన్నారు.