జగన్ మమ్మల్ని కాదు మోడీని ప్రశ్నించాలి : దేవినేని ఉమ

Friday, May 18th, 2018, 04:47:49 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై, టీడీపీ పై చేస్తున్న వ్యాఖ్యల పై తీవ్రంగా మండిపడ్డారు కృష్ణ జిల్లా ఎమ్యెల్యే దేవినేని ఉమా. ఆయన నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధమవుతుందా అన్నారు. ఒకవైపు మొన్న గోదావరిలో జరిగిన పడవ ప్రమాద మృతులకు ప్రభుత్వం ఏవిధంగా మరింత మెరుగైన సాయం అందిచాలా అని చూస్తుంటే జగన్ మాత్రం తననోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవి ప్రభుత్వము చేయించిన హత్యలని అనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఆయనను చూసి ఆ పార్టీనేతలు కూడా అవగాహరాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు.

ఒకవైపు చంద్రబాబు, టిడిపినేతలు రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై కేంద్రాన్ని, బిజెపిని నిలదీస్తోంటే జగన్ మాత్రం ప్రజా సంకల్ప యాత్ర పేరుతొ దగా యాత్ర చేస్తున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వైసిపి నేతలకుగాని, జగన్ కు గాని కనపడడంలేదా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం విషయంలో హోదా విషయం, విభజన హామీల విషయంలో కేంద్రం వారు చేసిన అన్యాయంపై జగన్ ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అన్నారు. మోడీని నిలదీసే దమ్ము మీకుకాని, మీ కార్యకర్తలు, నేతలకు లేదా అని అన్నారు. ఇకనైనా బూటకపు మాటలు జగన్ మానుకుంటే మంచిదని, ఇప్పటికే వారి పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని, ఇలానే మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెపుతారని హెచ్చరించారు…..

Comments