తన మానవతా దృక్పథాన్ని చాటి చెప్పుకున్న జగన్..!

Wednesday, October 3rd, 2018, 07:06:16 PM IST

వై ఎస్ ఆర్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసినదే.ఇటీవలే ఆయన 3000 కిలోమీటర్లు పూర్తి చేసిన మైలురాయిని కూడా అందుకున్నారు.ప్రస్తుతం వై ఎస్ జగన్ విజయ నగరం జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసినదే.అయితే ఎప్పటిలాగే జగన్ తన పాదయాత్ర పూర్తయిన వెంటనే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు, ఈ రోజు కూడా అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సభను ఏర్పాటు చేశారు.ఈ సభలో జగన్ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.


వై ఎస్ జగన్ నెల్లిమర్లలో సభ ఏర్పాటు చేయగా అక్కడికి భారీ స్థాయిలో జనం చేరుకున్నారు.దీనితో అక్కడి వాతావరణం కిక్కిరిసిపోయింది.సరిగ్గా అదే సమయంలో ఒక ఆటో వచ్చింది,అందులో ఒక గర్భిణీ స్త్రీ ఉంది అన్న విషయం తెలుసుకున్న జగన్ అక్కడికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులను ఆ తల్లి ఉన్న ఆటోకు దారి వదలాల్సిందిగా కోరారు.దీనితో ఆ ఆటో పూర్తిగా బయటకు వెళ్లేంత వరకు జగన్ దారి ఇవ్వాలని కోరారు.దీనితో అభిమానులు ఆ ఆటోకు దారి వదిలారు.ఈ సంఘటన ద్వారా జగన్ తన పెద్ద మనసును చాటుకున్నారు.

అదే సమయంలో జగన్ ఇది వరకు ఇలాంటి సమస్యలు ఏవి తలెత్తకుండా 108 అంబులెన్సు సర్వీసు ఉండేదని ఇప్పుడు చంద్రబాబు దుర్మార్గపు పాలనలో ఒక ఆటోలో ఇలా ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళవలసిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.