2018 లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు..?

Wednesday, November 30th, 2016, 12:59:25 PM IST

Jagan
చంద్రబాబు ఏపీ లో చేస్తున్న పాలన గురించీ ఆయన ముఖ్యమంత్రి గిరీ గురించీ ఎప్పుడూ ఎదో ఒక జోస్యం చెప్పే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పేశారు . రెండు రోజుల పర్యటన కోసం తన సొంత నియోజికవర్గం పులివెందుల వచ్చిన జగన్ తన క్యాంపు కార్యాలయం లో పులి వెందుల – జమ్మలమడుగు ప్రాంత నాయకులతో రకరకాల సమస్యల గురించి మాట్లాడారు. అనంతరం వారితో జగన్ మాట్లాడుతూ 2018లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం కార్య కర్తలు – నాయకులు సిద్దంగా ఉండాలని జగన్ సూచించారు. రాష్ట్ర అభివృద్ధి పడకేసింది అనీ చంద్రబాబు కి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం అనీ వ్యాఖ్యలు చేసారు జగన్. అధికారం లో ఉండే ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాలు తీసుకుని రాదు అనీ టీడీపీ సర్కారు ఏ పథకం చేపట్టినా సొంత మనుషుల కోసమే అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఎన్నో సమస్య లతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకు ముందు సింహాద్రిపురంలో ఎంపి నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు.