ప్రత్యేక హోదా విషయంలో పవన్ కంటే వెనుకబడ్డ జగన్

Thursday, January 26th, 2017, 03:50:41 AM IST

jagan-pawan
తమిళనాడు ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి జల్లికట్టు ఫై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయించారు. ఈ జల్లికట్టు ఉద్యమాన్ని చూసి స్ఫూర్తి పొందిన ఆంధ్ర యువత ఈ నెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో నిర్వహించాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే తన మద్దతును తెలిజేశారు. పవన్ మద్దతు తెలపడంతో ఈ ఉద్యమానికి కొండంత బలం వచ్చింది. అంతకుముందు ప్రత్యేక హోదా కోసం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అయితే అవేవీ సత్పలితాలు ఇవ్వలేదు. దీంతో ఆ ఉద్యమం కాస్తా చల్లారిపోయింది.

ఇప్పుడు తెలుగు యువత చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వెంటనే పవన్ మద్దతు తెలపడంతో జగన్ డైలమాలో పడ్డారు. ఇప్పుడు ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తే క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ కు వెళ్ళిపోతుందని జగన్ భావించారు. అయితే మద్దతు ఇవ్వకపోతే జనల సృష్టిలో చులకన అయిపోతానని భావించిన జగన్ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి తానే ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సిన జగన్ మరొకరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఏంటన్నది ఇప్పుడు చర్చించుకుంటున్నారు.