జగన్ ఆకతాయి పిల్లాడు, పవన్ అవగాహన లేని వ్యక్తి : టీడీపీ నేత

Sunday, June 10th, 2018, 11:49:22 AM IST

రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల దూకుడు పెంచుతున్నారు. ఇటీవల ప్రజాపోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వం ఇసుక దోపిడీ, అవినీతి, అక్రమాలపై తాను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నానని, టిటీడీపీ జండాలు మోసినవారికి మాత్రమే సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారని, అలానే కేవలం టిడిపి నేతలతో అనుబంధం వున్న వ్యక్తుకులకు మాత్రమే ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య నేడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని, నిజానికి 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబూ, అలానే టిడిపి ప్రభుత్వం ఎంతో మంచిగా కనపడ్డ పవన్ కళ్ళకు, నేడు వున్నట్లుండి ఎందుకు చేదుగా కనపడుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ ఎప్పుడైతే ఎన్డీయే నుండి బయటకు వచ్చిందో అప్పటినుండి పవన్ టిడిపి ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు పవన్ కు ఏమాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులగురించి అవగాహన లేదని, రాజకీయాలంటే సినిమాలు కాదని, ఏ సినిమా స్టార్ అయినా రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి కావొచ్చని, కాకపోతే ముఖ్యమంత్రి అయిన ప్రతి స్టార్ ఎన్టీఆర్ కాలేడని అన్నారు. పవన్ బిజెపితో రహస్య పొత్తుపెట్టుకుని తమపార్టీపై చేస్తున్న ఆరోపణలు ఇకనైనా మానాలని, వాస్తవాలు తెలుసుకుని ఆయన మాట్లాడితే మంచిదని హితవు పలికారు. మరోవైపు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి తమ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన కళ్ళకు కనపడడంలేదా అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి పీఠం చేపట్టడానికి జగన్ ఇలా తమపై నిందారోపణలు చేస్తున్నాడని, జగన్ చంద్రబాబు పై చేసే వ్యాఖ్యలు చూస్తే ఒక ఆకతాయి పిల్లడు చేస్తున్న వ్యాఖ్యలవలె అనిపిస్తున్నాయని చమత్కరించారు…..

  •  
  •  
  •  
  •  

Comments