జగన్ అధికార దాహంతో అజ్ఞానిలా మాట్లాడుతున్నాడు : నర్సాపురం ఎమ్యెల్యే

Friday, June 1st, 2018, 02:27:03 AM IST

వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక అజ్ఞాని అని, కేవలం రాష్ట్రానికి తాను సీఎం అవ్వాలనే ద్యేయంతో టీడీపీ పై అక్కసుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎమ్యెల్యే బి మాధవ నాయుడు అన్నారు. అసలు ఆయనకు టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కనపడడంలేదని మండిపడ్డారు. ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని జగన్ కు కానీ, వైసిపి నేతలకు కానీ అమరావతి గురించిగాని అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అంతే కాక ఇక్కడ పాదయాత్ర చేపట్టిన జగన్ కు ప్రజల మద్దతు పూర్తిగా కరువయిందని, అది వైసిపి నేతలకు కూడా తెలుసునని, కానీ వారు లేనిపోని డంబాచారాలు పలుకుతూ అయన యాత్రకు జనం వస్తున్నారని అబద్దపు కబుర్లు చెపుతున్నారని అన్నారు.

ఎలాగైనా అధికారం దక్కించుకోవడానికి జగన్ ఆచరణ సాధ్యంకాని పలు హామీలను ఇస్తూ ముందుకు సాగుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పై కుట్ర చేసి ఆయన పేరుని దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటివరకు ఏమాత్రం అభివృద్ధి నోచుకోని నర్సాపురం ఇన్నాళ్లకు చంద్రబాబు చలువ వల్ల ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం అన్నారు. అలానే ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ రహదారుల కోసం రూ.39కోట్ల మేర నిధులు రప్పించి ఆయనంత సుందరంగా రోడ్లు వేయించారని అన్నారు. ఏపీ ప్రజలు వైసిపి నేతల కుటిల రాజకీయాలకు లొంగరని, మరొక్కసారి టీడీపీకె అధికారం ఇచ్చి తీరుతారని, చంద్రబాబు మళ్ళి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు…..