జగన్ నీ పద్దతి మార్చుకో… హెచ్చరించిన పవన్

Saturday, March 16th, 2019, 01:20:57 AM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడిండి. ప్రచారాలు కూడా ప్రారంభం అయ్యాయి… ఒకరిని తప్పుబడుతూ మరొకరు ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారాలు జోరుగానే సాగిస్తున్నాడు. నిన్న ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కెసిఆర్ గారంటే నాకు చాలా ఇష్టం. వారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు కూడా… కానీ అవి మేము కుటుంబాల వరకు మాత్రమే చూసుకున్నాము. అంతేకాని రాజకీయాల్లోకి అవి తీసుకురాలేదని ఆయన అన్నారు. మీరు కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో కెసిఆర్ తో కలవడం అసలే బాగోలేదు.

ఎందుకంటే రాష్ట్రము విసిపోకముందు తాను ఆంధ్ర ప్రజలమీద, నాయకుల మీద తీవ్ర వాఖ్యలు చేశారు. మనల్ని తరిమికొడదామని మాట్లాడినటువంటి కెసిఆర్ తో జత కట్టడం ఏంటని పవన్ ప్రశ్నించారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో పద్దతిగా ప్రజలందరినీ కూడా తన వల్లే అనుకున్నారు. అందరు నాయకులూ కూడా మనకి సన్నిహితులే అనే ఉద్దేశంతో మెలిగేవారు. కానీ మీరు చేసేది చాలా తప్పు. మీ పడ్డ టి కాస్త మార్చుకుంటే మంచిదని జగన్ ని హెచ్చరించారు పవన్. అంతేకాకుండా మీకేమైనా గొడవలు ఉంటె మీరు మీరు చూసుకోండి కానీ అవి ప్రజల మీదకు రుద్దకండి అని పవన్ ఆరోపించారు.