2019 లో జగన్ సిఎం అంటున్న జ్యోతిష్కుడు!

Saturday, January 27th, 2018, 03:50:30 AM IST


ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణం లో సర్వే లు చేసే హడావిడి అంత ఇంతా కాదనే చెప్పాలి. ఫలానా సర్వే వాళ్ళకి అనుకూలంగా వుంది, ఫలానా సర్వే ఈ పార్టీకి అనుకూలం అనే వాదనలు కూడా వింటూనే వున్నాం. పలు మీడియా సంస్థలు అయితే మూడు నెలలకొకసారి సర్వే లు చేయడం చూస్తుంటాం. ఇక జ్యోతిష్కులు కూడా ఆయా పార్టీ నాయకుల జాతకచక్రాలు పట్టుకుని తెగ రెసెర్చిలు చేస్తుంటారు. అయితే సర్వే ల పరంగా రాష్ట్రం లో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ చేసే సర్వే లు చాలావరకు వచ్చిన ఫలితాలకు దగ్గరగా వున్నాయనే చెప్తున్నారు. 2009 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి అధికారం దక్కుతుందని అప్పట్లో లగపాటి చేసిన సర్వే, అలానే నీల్సన్ ఓఆర్ జి మార్గ్ సర్వే ల ద్వారా తేలింది. అయితే వారు చెప్పినట్లే అనూహ్యంగా అప్పట్లో కాంగ్రెస్ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇలా కొన్ని సందర్భాల్లో సర్వే లు కొంత నిజం అయినా సంఘటనలు లేకపోలేదు. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం రాబోయే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలానే తెలంగాణ లో టిఆర్ఎస్ కు అధికారం దక్కడం ఖాయమని అహ్మద్ రహిముల్లా ఖాన్ అనే ముస్లిం జ్యోతిష్కులు జ్యోష్యం చెప్పారు. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమం లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆంధ్రాలో వైఎస్ఆర్ పార్టీ కి 100 కు పైగా, అలానే టి డిపి కి 60 సీట్లు వస్తాయని ఆయన జ్యోతిష్యం చెప్పారు. తెలంగాణాలో అయితే టి ఆర్ ఎస్ కి మెజారిటీ స్థానాలు దక్కి అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పుకొచ్చారు. అలానే కేంద్రంలో హోరాహోరీ పోరి జరుగుతుందని, అయితే చివరకు బిజెపి దే విజయమన్నారు. తాను ఇప్పటివరకు చెప్పినవి జరిగాయని అలానే 2019 ఎన్నికల ఫలితాలపై తన జ్యోతిష్యం తప్పక నిజం అవుతుందని రహీముల్లా ఖాన్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఆయన చెప్పిన జ్యోతిష్యం వై సి పి శ్రేణుల్లో ఆనందోత్సవాహాలు వెల్లివిరిసినట్లు తెలుస్తోంది.