జగన్ సైలెంట్ ప్లాన్.. వర్కౌట్ అయితే సిఎం పక్కా!

Tuesday, April 3rd, 2018, 08:25:28 AM IST

పాలిటిల్స్ లో ట్రిక్స్ స్పెషల్ గా ముందే ప్లాన్ చేసుకోవడం ఒక ఎత్తైతే. క్లిష్ట పరిస్థితుల్లో సమయాన్ని బట్టి సెకన్స్ లో తీసుకునే నిర్ణయం మరొక ఎత్తు. ఎలాంటి రాజకీయ నాయకుడికైనా అదృష్టం తో పాటు అవగింజంత మాస్టర్ మైండ్ ఉంటే.. ఇట్టే సక్సెస్ అందుకుంటాడు. ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుతం సమయాన్ని బట్టి సరికొత్త నిర్ణయం తీసుకునే విధంగా రాజకీయ నాయకులు నడుచుకుంటున్నారు. ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది తరువాత సంగతి. ఆచరణలో కరెక్ట్ గా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం ఏపిలో ప్రత్యేక హోదా పై పార్టీలన్నీ గళాన్ని విప్పుతోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అబ్బే.. ఎందుకండి? స్పెషల్ స్టేటస్ ప్యాకేజీలు వస్తాయి కదా.. అని అన్నవారు కూడా సెంటిమెంట్ తో కొట్టాలని నెక్స్ట్ ఎలక్షన్ కోసం మాట మార్చేశారు. రెండు ఎలుకలు కొట్టుకుంటే పాలని సైలెంట్ గా ఓ పిల్లి తాగేసినట్టు.. జగన్ ఇప్పుడు జనాల్లో చేరిపోయి ప్రత్యేక హోదా పై వైసిపి పోరాటం చేస్తోందని ప్రచారం చేసేసుకుంటున్నాడు. జగన్ ప్రజ సంకల్పయాత్ర ఇప్పటికే సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. జనలైతే బాగానే వస్తున్నారు. సోషల్ మీడియాలో జగన్ కోసం జనం అనే ట్యాగ్ లైన్స్ తో ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ జనసేన – తెలుగుదేశం పార్టీ మీటింగ్ లలో అలాగే మీడియా ముందు ప్రత్యేక హోదా విషయాన్ని పదే పదే చెబుతూ.. వాళ్లు కుట్ర చేస్తున్నారు.. వీళ్లు దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కానీ జగన్ ఇప్పటికే 120 రోజుల ప్రజయాత్రను సక్సెస్ గా ఫినిష్ చేసి గ్రామ స్థాయి నుంచి ఆదరణ అందుకునే ప్రయత్నం చేశాడు. ప్రతి సెంటర్లలో జనాలను ఒక చోటుకి చేర్చి చంద్రబాబు పై తన కౌంటర్లను విసురుతూ.. ఫ్యాన్ పార్టీనే కేంద్రం చుట్టూ చాలా స్పీడ్ గా తిరుగుతోందని, ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు పోరాటం చేస్తున్నట్లు ప్రచారంలో వివరిస్తున్నాడు.

సెంటిమెంట్ గా జనాల్లో కలిస్తే ఆ ఆదరణ తీరు వేరేగా ఉంటుంది. పాదయాత్ర సాధారణంగా ఫెయిల్ అయ్యే అంశం కాదు. చాలా వరకు ఆ ప్రయోగం వల్ల లాభాలే ఉన్నాయి. జగన్ కూడా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. పక్క పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా కూడా పాదయాత్ర లో తన మైండ్ ని మార్చుకోవడం లేదు. ఇలానే కొనసాగితే 2009 ఎలక్షన్ తరహాలో వైఎస్ గెలిచినట్టుగా మ్యాజిక్ జరగవచ్చని టాక్ వస్తోంది. మరి ఈ మ్యాజిక్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments