హార్ట్ ట‌చ్చింగ్ న్యూస్ : చిన్నాన్న‌ చివరి చూపుకు.. వెళ్లలేని దారుణ పరిస్థితుల్లో జగన్..!

Friday, March 15th, 2019, 12:28:20 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న, ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి ఈరోజు గుండెపోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. పులివెందులలో ఆయ‌న‌ స్వగృహంలోనే ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో, ఒక్కసారిగా కుప్పకులిపోయిన వివేకానంద‌రెడ్డి తుది శ్వాస విడిచారు. దీంతో వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబంలోనూ, అభిమానుల్లోనూ, వైసీపీ శ్రేణుల్లోనూ విషాద చాయ‌లు అలుముకున్నాయి.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాబాయి మ‌ర‌ణ వార్త విన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ రోజు శుక్ర‌వారం కావ‌డంతో, జ‌గ‌న్ నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. దీంతో జ‌గ‌న్ వెంట‌నే హైద‌రాబాద్ నుండి పులివెంద‌ల వెళ్ళ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలో ముందుగా నాంప‌ల్లి హైకోర్టుకు వెళ్ళి, ప‌ర్మిష‌న్ తీసుకుని, బాబాయిని చివ‌రిసారి చూడ‌డానికి జ‌గ‌న్ వెళ్ళ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణ‌వార్త విని కృంగిపోయిన జ‌గ‌న్, బాబాయిని చివ‌రి చూపు చూడాడానికి అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. దీంతో జ‌గన్ ప‌రిస్థితి చూసి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు వైసీపీ శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.