పవన్ పై జగన్ వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు : ఉండవల్లి

Wednesday, July 25th, 2018, 07:55:18 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిన్న వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్త్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై జనేనన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కేసుల్లో ఏ1 గా వున్న జగన్ మోహన్ రెడ్డి గారికి పవన్ వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డాయి. ఓవైపు అసెంబ్లీ లో ప్రజల సమస్యలపై చర్చలు జరుగుతుంటే ఏ మాత్రం తమకు పట్టకుండా సభనుండి వాకౌట్ చేసిన వైసిపికి ఏమి తెలుసునని, జగన్ అవగాహనా రాహిత్యంతో పవన్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేసారని అన్నారు. ఇక పవన్ కూడా స్పందిస్తూ, రాష్ట్రాన్ని తన తండ్రిని అడ్డంపెట్టుకుని దోచుకున్న జగన్ కె అంత ఉంటె,

ఇక నిజాయితీపరుడైన తనకు ఎంత ఉండాలని అయన అన్నారు. పోతే నేడు ఢిల్లీ లోని మీట్ ది ప్రెస్ కార్యమంలో మాట్లాడిన ఉండవల్లి, గత కొద్దిరోజుల నుండి ఏపీ రాజకీయాలను గమనిస్తున్నానని, నిన్న జగన్ గారు పవన్ పై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన ఆయన, నిజానికి పవన్ గారి భార్యల విషయం ఆయన వ్యక్తిగతమని, వారి పెళ్ళాల విషయం వారే చూసుకోవాలని, దానిపై మనం కామెంట్ చేయడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయాలను కలుషితం చేసేప్రమాదం ఉందని అన్నారు. వ్యక్తిగతం వేరు, రాజకీయాలు వేరు, ఆయన ప్రజలకు ఎంత మేర మేలు చేయలగలరు అనేదానిపై మాట్లాడాలి తప్ప, ఇటువంటివి మాట్లాడకూడదని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments