బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షునిగా దాల్మియా

Sunday, June 2nd, 2013, 05:19:49 PM IST

బీసీసీఐ వర్కింగ్ కమిటీ తాత్కాలిక అధ్యక్షునిగా జగ్ మోహన్ దాల్మియా నియమితులయ్యారు. ఎంత మంది ఒత్తిడి చేసినా బీసీసీఐ శ్రీనివాసన్ మాత్రం రాజీనామా చేయలేదు. దీంతో బోర్డు సభ్యులు బీసీసీఐ తాత్కాలిక చీఫ్ గా జగ్ మోహన్ దాల్మియాను ఎన్నుకున్నారు. దాల్మియా 2001నుంచి 2004 వరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఇక ఈ మీటింగ్ లో పాల్గొన్న బోర్డు సభ్యులు దాల్మియాకు మద్దతు తెలిపారు. అనంతరం బీసీసీఐ సమావేశం వాయిదా పడింది.

బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరిగింది. అరుణ్ జైట్లీ, రాజీవ్ శుక్లా, అనురాగ్ ఠాకూర్ లు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని శ్రీనివాసన్ పై అన్నివైపుల నుంచి ఒత్తిడి అధికమైంది. దాంతో బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చివరికి బీసీసీఐ తాత్కాలిక చీఫ్ గా జగ్ మోహన్ దాల్మియాను ఎన్నుకున్నారు.