బాబు ఢిల్లీ దీక్ష: కేసీఆర్ ను 8వ నిజామ్ గా అభివర్ణించిన జైరామ్ రమేష్..!

Monday, February 11th, 2019, 05:40:30 PM IST

మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్న సంగతి తేలిసిందే, బాబు దీక్షకు మద్దతు తెలిపేందుకు జాతీయస్థాయిలో ప్రముఖ నాయకులంతా దీక్ష స్థలికి కదిలారు. చంద్రబాబుతో కలిసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు కలిపారు, దీక్ష స్థలిలో బాబుకు మద్దతు తెలుపుతూ ప్రసంగించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ చంద్రబాబుపై ప్రశంశలు కురిపించారు. చంద్రబాబు హైదరాబాద్ ను ఐటీ పరంగా ప్రపంచ పటంలో పెట్టారని కొనియాడారు, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో అభివృద్ధి కుంటూ పడిందని అన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ 8వ నిజామ్ పాలనలో ఉందని, ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఒకనాటి శత్రువులు ఇప్పటి ప్రాణ మిత్రులు అయిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పార్టీలకు చెందిన చంద్రబాబు జైరామ్ రమేష్ లు ఇద్దరూ ఇలా ఒకరినొకరు ప్రశంసించుకోవటం అంతే కాకుండా మోడీ కేసీఆర్ లపై సెటైర్లు వేయటం కాస్త విడ్డూరంగానే ఉంది.