బాబు ఢిల్లీ దీక్ష: మోడీ పొరపాటున కూడా నిజం మాట్లాడరన్న సీనియర్ నేత.

Monday, February 11th, 2019, 05:48:53 PM IST

ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే, బాబు దీక్షకు మద్దతుగా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ గొంతు కలిపి నినాదిస్తున్నాయి. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపినవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ సహా పలువురు జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు.

చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ ప్రసంగించిన జైరాం రమేష్ మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ పర్యటనలో భాగంగా గుంటూరు సభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మోడీకి బాబు ఆయన భాషలోనే జవాబిచ్చారని అన్నారు. మోడీ పొరపాటున కూడా నిజం మాట్లాడరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు, ప్లకార్డులు నుండి ప్రముఖుల ప్రసంగాల దాకా ఎక్కడ చూసినా మోడీ వైతిరేక నినాదాలతో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష కాస్తా మోడీ వ్యతిరేకుల సభగా మారిపోయింది అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.