అయ్యా జైట్లీ గారు పంచదారపై కూడా పన్నా?

Saturday, May 5th, 2018, 06:59:02 AM IST


ఇప్పటికే దేశంలోని ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒకే పన్ను విధానమైన జీఎస్టీతో ఒకింత ఇబ్బందిపడుతున్నారని ప్రతిపక్షాలు అధికారపక్షం పై ఆరోపణలు చేస్తున్నారు. కాగా బిజెపి ప్రవేశపెడుతున్న ఈ విధానాల వల్ల వారికి ప్రజల్లో వున్న ప్రాభవం రోజురోజుకి తగ్గుతోంది అని కొన్ని సర్వేలు కూడా చెపుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇటీవలి జీఎస్టీ కౌన్సిల్ లో సమావేశంలో భాగంగా మన నిత్యావసర పధార్ధమయిన పంచదార పై సెస్ విధించారు. అయితే ఆ విధంగా సెస్ విధించడం సరైనది కాదని,

ఇప్పటికే పలురకాల ఆహారపదార్ధాలపై జీఎస్టీ విధించారు, మళ్ళి ఇప్పుడు ఆఖరికి రోజువారీ అవసరమైన పంచదారపై కూడా సెస్ విధిస్తున్నారు, దానిని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు జైట్లీకి లేఖ రాశారు. ప్రతి కేజీ పంచదారపై రూ.3 సెస్ విధించడం వల్ల సామాన్యుడిపైనే అధికభారం పడుతుందని, దానివల్ల మధ్య, దిగువతరగతి వర్గాలవారు నష్టపోతారని, కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల మేర భారం భరిస్తుందని, కావున మీరు మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది……

Comments