పవన్ ని కించపరిచేలా జలీల్ వ్యాఖ్యలు..ఒక్క సీట్ కూడా గెలవలేడు..ఛాలెంజ్!

Thursday, November 1st, 2018, 02:43:28 PM IST

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనే పేరు కన్నా బీకామ్ లో ఫిజిక్స్ అనే మాట అంటేనే మన రాష్ట్ర ప్రజలకు ఏక్కువగా తెలిసి ఉంటుంది.అయితే ఇప్పుడు జలీల్ ఖాన్ జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ మీద కొన్ని అసాధారణ వ్యాఖ్యలు చేశారు.అవి ఒకింత కించపరిచేలాను పవన్ యొక్క అభిమానులు ఆగ్రహానికి గురయ్యేలా ఉన్నాయనే చెప్పాలి.ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ ను వచ్చే ఎన్నికల్లో చాలా లైట్ గా తీసుకోవాలని,ఆయనకీ ముఖ్యమంత్రి అయ్యేంత సీన్ లేదని మండిపడ్డారు.

అంతే కాకుండా ఆయన అన్నయ్య ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ యువ రాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడని,వాళ్ళ అన్నయ్య సొంత ఊర్లోనే గెలవలేకపోయాడని అలాంటిది పవన్ ఎలా గెలుస్తాడని,పవన్ వాళ్ళ అన్నయ్య కన్నా గొప్పోడా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాకుండా వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు ఎదో సినీ యాక్టర్ ని చూడ్డానికి వచ్చిన జనం 16 సీట్లు కట్టబెట్టారని,ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి సినిమాలు లేక పవన్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఒక్క సీట్ కూడా పవన్ గెలవలేడు,అంతెందుకు అప్పుడు వాళ్ళ అన్నయ్యే గెలవలేకపోయాడు,నా అనుభవం బట్టి చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలవలేడు అని అంతెందుకు ఆయన నిలబడిన సీట్ కూడా పవన్ గెలుచుకోలేడు ఛాలెంజ్ చేస్తున్నాను అని వివాదానికి దారి తీసే వ్యాఖ్యలు చేశారు.పవన్ వల్లనే టీడీపీ గెలిచింది కదాని అని అడిగితే అది తప్పు మేము పవన్ దగ్గరకి వెళ్ళలేదు పవనే వారి దగ్గరకి వచ్చి మద్దతు ఇస్తా అని అన్నారని తెలిపారు.ఇప్పుడు జలీల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మరి వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments