పోలవరం కోసం బిచ్చమెత్తుతాం.. ఎమ్మెల్యేల ఆస్తులను అమ్మేస్తాం: టీడీపీ నేత

Friday, December 1st, 2017, 08:42:12 AM IST

గత కొన్నేళ్లుగా పోలవరం ప్రాజెక్ట్ పై ఎన్ని వివాదాలు విమర్శలు చెలరేగుతున్నాయో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రెజెక్ట్ పై ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ అధికార పక్షంపై చాలా ఒత్తిడి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం తప్పకుండా పోలవరం చంద్రబాబు అధికారం లోనే పూర్తవుతుందని చెబుతున్నారు. ఇక రీసెంట్ గా ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రీసెంట్ గా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేస్తామని చంద్రబాబు లక్ష్యసాధనకు పోరాడుతామని తెలిపారు. అవసరం అయితే బిచ్చమెత్తుతామని జోలెపట్టి నిధులు సేకరిస్తామని తెలుపుతూ.. ఎమ్మెల్యేల ఆస్తులు కూడా అమ్ముతామని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

  •  
  •  
  •  
  •  

Comments