ప్రపంచంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో!

Monday, May 28th, 2018, 06:20:19 PM IST

కథానాయకులు నటించే సినిమాలకు వాల్యూ పెరిగితే వారి రెమ్యునరేషన్ కూడా గట్టిగా పెరుగుతుందని అందరికి తెలిసే ఉంటుంది. కాలం పరిగెడుతున్న కొద్దీ సినిమాల వాల్యూ చాలా వరకు రెట్టింపవుతోంది. కొన్ని సినిమాలు ప్రపంచ స్థాయిలో హిట్ అవుతున్నాయి. అయితే ఈ ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆధారణ ఉంటుందని అందరికి తెలిసిందే. లక్షల కోట్ల బిజినెస్ ఉన్న హాలీవుడ్ లో సినీ తారలకు కూడా ఎక్కువ పారితోషికం అందుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పారితోషికం అందుకుంటున్న హీరోల్లో టాప్ 1 లో ఎవరున్నారో తెలుసా?. జేమ్స్ బాండ్ హీరో డేనియల్‌ క్రెగ్‌. నెక్స్ట్ మరో జేమ్స్ బాండ్ సిరీస్ రానుంది. క్యాసినొ రాయల్‌ – స్పెక్టార్‌ చిత్రాలతో ఎంతగానో అలరించిన డేనియల్‌ క్రెగ్‌ నెక్స్ట్ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది ఆ రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం డేనియల్‌ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. 50 మిలియన్ల పౌండ్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 450 కోట్లు. కేవలం రెమ్యునరేష్ పరంగానే కాకుండా సినిమా హిట్ అయితే అందులో లాభాలు కూడా అందుతాయి. పైగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా క్రెడిట్‌ దక్కుతుంది. మరి జేమ్స్ బాండ్ ఈ సారి ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments