పాక్ బుద్ది మారేలా లేదు..కౌంటర్ ఇస్తున్న ఆర్మీ!

Monday, May 21st, 2018, 04:00:52 PM IST

కుక్క తోక వంకర.. అది ఎన్ని సార్లు సరి చేసినా మారదు. పాకిస్థాన్ బుద్ధి కూడా అలాంటిదే. అయినా కుక్కతో పోల్చడం కూడా దండగే. ఎన్ని సార్లు సరిచేసి చెప్పినా కూడా రెచ్చగొట్టే విధంగా మాటలు లేదంటే దొంగ చాటు కాల్పులు పాక్ కు అలవాటుగా మారింది. భారత ఓర్పుకు ప్రతి ఫలంగా సైనికుల మరణాలు మిగులుతున్నాయే తప్పా ఫలితం మాత్రం దక్కడం లేదు. కవ్వింపు చర్యలకు పాల్పడటంతో పాక్ ను ఎవరు మించిలేరు.

రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో జరిపిన కాల్పులే పాక్ వికృత బుద్ధికి నిదర్శనంగా నిలిచాయి. పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లతో పాటు మరికొంత మంది సాధారణ పౌరులు మరణించారు. దీంతో భారత్ కౌంటర్ ఇచ్చే లోపు పాక్ కాళ్ల బేరానికి వస్తోంది. జమ్ముకశ్మీర్‌ అర్నియా సెక్టార్‌లో గల మూడు బార్డర్‌ అవుట్‌పోస్టులపై ఈ ఉదయం నుంచి పాక్ కాల్పులు జరపటం అందరిని షాక్ కి గురి చేసింది. మొదట ఉగ్రవాదులు అనుకునప్పటికీ పాకిస్థాన్ రేంజర్స్‌ కాల్పులకు తెగబడినట్లు తెలిసింది.

సీనియర్‌ బీఎస్‌ఎఫ్‌ అధికారి ఆ విషయాన్ని వెల్లడించారు. ఏ మాత్రం సందేహించకుండా ఎప్పటికప్పుడు భారత్ పాక్ కు సమాధానం చెబుతోంది అని తెలియజేశారు. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. పాక్ సరిహద్దు శిబిరాలపై దాడులు చేసిన భారత్ రాకెట్ ను కూడా ప్రయోగించాయి. దీంతో పాక్ సైనిక అధికారులు జమ్ములోని బీఎస్‌ఎఫ్‌ కేంద్రానికి ఫోన్‌ చేసి ఇంతటితో కాల్పులు ఆపాలని బ్రతిమాలినట్లు భారత సీనియర్ సైనిక అధికారి తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments