వైరల్ వీడియో : ట్రైన్ వస్తుంటే పట్టాలపై ప్రయోగం

Wednesday, January 24th, 2018, 12:00:00 PM IST

ప్రస్తుతం రోజుల్లో కొందరు ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎదో ఓక గుర్తింపు తెచ్చుకోవాలని ఎటువంటి ఉపయోగం లేని పనులు చేస్తున్నారు. అంతే కాకుండా మృత్యువుతో చెలగాటం ఆడుతున్నారు. అయితే రీసెంట్ గా జమ్మూ కశ్మీర్ లో ఒక యువకుడు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఒక రైలు వస్తుండగా పట్టాలపై పడుకున్నాడు. అది వెళ్లేంత వరకు అలానే ఉన్న ఆ యువకుడు ట్రైన్ వెళ్లిన తరువాత ఎదో విజయం సాదించినట్లు కేకేలు వేశాడు. ఆ సన్నివేశాన్ని మరొక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది. ఆ యువకుడు ఎవరూ ఇంకా తెలియరాలేదు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై స్పందించారు. నిజంగా ఇది నేను నమ్మలేకున్నా..ఇది చేయడం చాలా తప్పని సోషల్ మీడియా ద్వారా తెలుపగా నెటిజన్స్ కూడా ఎవరి స్టైల్ లో వారు కౌంటర్ వేశారు.