తెలంగాణ ఉద్యమాన్ని ఉగ్రవాదంతో పోల్చడం సభబేనా జానా !

Friday, September 28th, 2018, 03:46:53 PM IST

తెలంగాణ యువ నేత కేటిఆర్ ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో తండ్రి కేసిఆర్ కంటే అప్పుడూ ముందుటారు. ముఖ్యంగా కాంగ్రెస్ మీద ఒంటికాలితో లేస్తుంటారాయన. కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారా.. కడిగిపారేద్దామా అని ఎదురుచూసే కేటిఆర్ అందుకు సోషల్ మీడియానే వేదికగా చేసుకున్నారు.

నిన్న మొన్నటి వరకు ఒకప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో దొరికిన కాలిన కరెన్సీ నోట్ల వివాదాన్ని వాడుకున్న ఆయన కాంగ్రెస్ పేరును స్కాంగ్రెస్ అని ఉచ్చరిస్తూ తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి మీద పడ్డారు. ఒక మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమం గురించి జానా మాట్లాడుతూ కేసిఆర్ పోరాటం వలన కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వలేదు. ఇవ్వాలనుకుంది కాబట్టి ఇచ్చింది అంటూ ఆ పాకిస్థాన్ తో పోరాడిన, ఉగ్రవాదుల్ని అణచివేసిన కాంగ్రెస్ పార్టీకి కేసిఆర్ ఉద్యమాన్ని అణచివేయడం 5 నిముషాల పని అన్నారు.

ఇలా ఆయన ప్రజా ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని ఉగ్రవాదంతో, పాకిస్థాన్ చర్యలతో పోలుస్తూ మాట్లాడటం నిజంగానే సబబు కాదు. ఇది తెలంగాణ ఉద్యమకారుల, ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడమే. ఈ విలువల్లేని మాటలతో మరోసారి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుని ఇబ్బందుల్లో పడింది. ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన కేటిఆర్ కాంగ్రెస్ వాళ్ళది ఫ్యూఢల్ భావజాలం అంటూ విమర్శకు దిగారు. ఏదో ఈసారైనా ఎన్నికల్లో కాంగ్రెస్ కొంతైనా హవా చూపుతుంది అనుకుంటే నాయకులు మాత్రం ఇలా ఓటర్ల మనోభావాల్ని దెబ్బతీస్తూ తమకు తామే నష్టాన్ని చేకూర్చుకుంటున్నారు.