ఒక్క మాటతో బోలెడు సందేహాలు రేపిన జనసేనాని..!

Wednesday, February 15th, 2017, 03:50:57 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి రాజకీయ కదలిక ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. వరుస సభలతో ఇప్పటికే హోరెత్తిస్తున్న జనసేనాని దానిని ఇకముందు కూడా కొనసాగించనున్నారు.హార్వర్డ్ యూనివర్సిటీ లో ఇండియా కాన్ఫెరెన్స్ సమావేశం కోసం పవన్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.ఇప్పటికే పవన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా, ఉద్దానం కిడ్ని సమస్య, అమరావతి మరియు పోలవరం భూసేకరణ వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలంటే విస్తృతంగా పవన్ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా పర్యటన లోను పవన్ జనసేన పార్టీ అంశాన్ని ఎన్నారైల ముందు ప్రస్తావించారు. జనసేన పార్టీకి అక్కడ అభిమానుల నుంచి మంచి మద్దత్తు లభించింది.

హార్వర్డ్ యూనివర్సిటీ లో జరిగిన ఇంటర్వ్యూ లో ఆయన జనసేన పార్టీకి సంబందించిన కీలక అంశాన్ని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ ) పోతు పెట్టుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ”దానిగురించి నేను ప్రస్తుతం ఆలోచించడం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఒకే ఆలోచనలు కలిగిన వారు కలసి పని చేయాలి” అని పవన్ తెలపడం విశేషం.పవన్ ఒక్కమాట తోఅనేక సందేహాలు రేపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి పవన్ దాదాపుగా సిద్ధం అయినట్లు అనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిజెపిని తీవ్రంగా దుయ్యబడుతున్న విషయం తెలిసిందే. కానీ చంద్రబాబు విషయం లో పవన్ వైఖరి ఏంటనేది అర్థం కానీ స్ట్రాటజీ అని అంటున్నారు. బాబు తో విడిపోయేంతగా పవన్ టిడిపిని విమర్శించలేదు. మరోవైపు టిడిపి కూడా పవన్ ఇప్పటికి తమ మిత్రుడే అని సమర్ధించుకుంటోంది. కానీ ఆప్ తో పొత్తు విషయం పవన్ మనసు లో ఉన్నట్లు అతని వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. పవన్ తో స్నేహం కోసం కేజ్రీవాల్ ప్రయత్నిస్తారో లేదో చూడాలి.