ఈ రోజు రాజమండ్రి సభలో వీరికి చుక్కలేనా..?

Thursday, March 14th, 2019, 02:40:00 PM IST

ఈ రోజుతో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అనే పార్టీ పెట్టి 5 సంవత్సరాలు ముగుస్తుంది.సినీ హీరోగా రాజకీయాల్లోకి వచ్చిన నటుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.2014 ఇదే తేదీన తాను రాజకీయాల్లోకి రాబోతున్నాను అని “జనసేన” పార్టీ స్థాపించారు.అప్పుడు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండానే అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చి గెలిపించిన సంగతి అందరికీ తెలిసినదే..అయితే ఆ తర్వాత మారిపోయిన రాజకీయ పరిణామాల వలన పవన్ వారికి ఎదురు తిరగడంతో పాటు ఎన్నో అవమానాలు,ఛీత్కారాలు కూడా పొందారు.

అదే సందర్భంలో అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ను కూడా పవన్ తన ప్రసంగాల ద్వారా టార్గెట్ చేసే వారు.ఇక ఈ కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను శాశ్వతంగా ప్రక్షాళన చేస్తానని వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చెయ్యబోతున్నానని స్పష్టం చేసేసారు.అయితే పవన్ వలన ఎలాంటి ప్రభావమూ ఉండదని చెప్పిన ఆ నోరులే ఇప్పుడు పవన్ తమకి మద్దతు ఇవ్వాలని వెంపర్లాడుస్తున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ ఒక సభ ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన స్పీచులు ఎంత అగ్రెసివ్ గా ఎంత ఆవేశపూరితంగా ఉంటాయో అందరికీ తెలుసు ఇప్పటికే ధవళేశ్వరంలో నిర్వహించిన భారీ కవాతు అనంతరం ఏర్పరిచిన సభ మరియు గత ఏడాది జనసేన 4 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగే రేంజ్ లో విరుచుకుపడి షాకిచ్చారు.

ఇక ఈ రోజుతో జనసేన పార్టీ ఆవిర్భవంచి 5 ఏళ్ళు పూర్తి కావస్తుండడంతో జనసేన శ్రేణులు ఈ సారి నిర్వహించబోయే సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న ఈ సభకు ఇప్పటికే లక్షలాది జనం రాష్ట్ర నలుమూలల నుంచి హాజరవుతున్నారని తెలుస్తుంది.జనసేనాని ఈ సభలో ఎలాంటి స్పీచ్ ఇవ్వనున్నారో అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.ఈ సారి సభలో మాత్రం జనసేనాని చంద్రబాబు మరియు జగన్ లను టార్గెట్ గా పెట్టుకొని స్పీచ్ ఇవ్వనున్నారని అక్కడ జనసేన శ్రేణులు అంటున్నారు.ఈ సారి స్పీచ్ తో మాత్రం అధికార ప్రతిపక్షాలు రెండిటికీ చుక్కలే అని అంటున్నారు.మరి ఇంకాసేపట్లో మొదలు కాబోయే ఈ సభలో పవన్ ఏ రేంజ్లో స్పీచ్ ఇస్తారో చూడాలి.