పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా – మాయావతి

Friday, March 15th, 2019, 04:06:39 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేగంగా కదులుతున్నారు. ఇప్పటికే సీపీఎం, సీపీఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీ అసెంబ్లీయే ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆయన మరొక జాతీయ పార్టీ బిఎస్పీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. ఈరోజు బిఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసిన పవన్ రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్బంగా దేశం మార్పు కోరుకుంటోందన్న పవన్ ఏపీ, తెలంగాణల్లో బిఎస్పీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టు, మాయావతిని ప్రధానిగా చూడాలని బలంగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక మాయావతి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగబోతున్నామని, సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు.