పవిత్రమైన ఓట్లనీ జనసేనకే పడ్డాయట !

Thursday, June 6th, 2019, 10:06:44 PM IST

గడిచిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన ఊహించని రీతిలో ఓటమిపాలైంది. పవన్ సైతం గాజువాక, భీమవరం స్థానాల్లో ఓడిపోగా ఒక్క రాజోలులో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇంత పరాభవంలో సైతం పార్టీ శ్రేణులు పాజిటివిటీని వెతుక్కోవడంలో సఫలమయ్యారు.

ఓడిపోయినా కూడా గత ఎన్నికల్లో జీరో బడ్జెట్ రాజకీయాలు చేశామని, ఇదే తమ తొలి విజయమని జనసేన శ్రేణులు గర్వంగా చెబుతున్నాయి. ఇతర పార్టీల మాదిరి తాము వందల కోట్లు కుమ్మరించ
లేదని, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో పాల్గొన్నామని అంటున్నారు. తమకు దక్కిన 6.7 శాతం అసెంబ్లీ ఓట్ షేర్, 6.1 శాతం పార్లమెంటరీ ఓట్ షేర్ డబ్బు పెట్టకుండానే వచ్చిందని, ఆ ఓట్లు చాలా పవిత్రమైనవని, అవే తమకు కొండంత బలాన్ని ఇచ్చాయని అంటున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే పవిత్రమైన ఓట్లన్నీ తామే దక్కించుకున్నామని చెబుతున్నారు. ఇక ఈరోజు నుండి ఉండవల్లిలో సమీక్షలు నిర్వహించనున్న పవన్ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై దృష్టి పెట్టనున్నారు.

Janasena cadres on positive note