ఆసియ కప్ మ్యాచ్ లో రెపరెపలాడిన జనసేన జెండా..!

Tuesday, September 18th, 2018, 11:17:15 PM IST

టాలీవుడ్ తారలందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు అని ఇప్పటి వరకు ఆయన అభిమానులు ఎంతో మంది ప్రముఖులు కూడా చాలా సార్లు తెలిపారు.పవన్ అభిమానులు ఏం చేసినా కాస్త ప్రత్యేకంగానే చేస్తారు అని చెప్పాలి. అది ఈ రోజు మళ్ళీ ఒకసారి ఋజువు అయ్యింది. ఈ రోజు దుబాయ్ లో జరుగుతున్న భారత్ మరియు హాంగ్ కాంగ్ మ్యాచ్ లో జనసేన పతాకం రెపరెపలాడింది.ఎలాగో ఆ సన్నివేశాన్ని చూసిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని ఆ ఫోటోలను షేర్ చేస్తూ పంచుకుంటున్నారు.

ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ నిమిత్తం దుబాయిలో గల పవన్ అభిమానులు తమ నాయకుడు జనసేనాని జనసేన జెండాతో దర్శనమిచ్చారు.ఐతే ఇలా చేయడం పవన్ అభిమానులకు కొత్తేమి కాదు,ఇది వరకు ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం సమయంలో ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన ఒక మ్యాచ్ లో కూడా పవన్ అభిమానులు తమ ప్రేమను చాటుకున్నారు.

ఏదేమైనా ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇదే తరహాలో ప్రభాస్ గారి అభిమానులు కూడా తమ అభిమానాన్ని ఒకసారి చాటుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments