రోమాలు నిక్కబొడిచేలా “జనసేన” భారీ కవాతు టీజర్.!

Thursday, October 11th, 2018, 02:00:19 PM IST

ఇది వరకే వైసీపీ పార్టీ అధినాయకుడు వై జగన్ యొక్క పాదయాత్ర రాజమండ్రికి చేరుకున్నప్పుడు అక్కడి వంతెన మీద పాదయాత్ర కొనసాగించినపుడు తనకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూపించిన సంగతి తెలిసినదే.ఏ రాజకీయ నాయకుడు ఐనా సరే తనకున్న ప్రజా బలాన్ని నిరూపించుకోవాలి అంటే అలాంటి యాత్ర ఒకటి చెయ్యాల్సిందే.ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో ఎలాంటి క్రేజ్ ఉందొ కూడా వేరే చెప్పక్కర్లేదు.ఇప్పుడు ఆ మాటను నిజం చేసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.

నిజానికి ఈ నెల 9వ తేదీన నిర్వహించాలి అనుకున్నా సరే,పవన్ కు ఉన్న క్రేజ్ నిమిత్తం గోదావరి వంతెన సరిపోదని అందువల్ల అక్కడ పోలీసు శాఖ వారు చెప్పగా పవన్ తన నిర్ణయాన్ని మార్చుకొని 15వ తేదీన ధవళేశ్వరం వంతెన పై ఉంటుందని పవన్ తెలిపారు.ఈ కవాతుతో జనసేనకు ఉన్న బలం కోసం రాష్ట్రం కాదు దేశం మొత్తం మాట్లాడుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.ఇప్పుడు అందుకుగాను ధవళేశ్వరం వంతెనను అక్కడి జనసేన కార్యకర్తలు,సంసిద్ధం చేస్తున్నారు.ఇప్పుడు ఈ భారీ కవాతు నిమిత్తం జనసేన సోషల్ మీడియాలో ఒక టీజర్ ను కూడా విడుదల చేశారు.

గోదావరి జిల్లాలో జనసేన దమ్మెంతో చూపించాలి,గోదావరి నదుల మీద జనసంద్రం పొంగాలి,2 జిల్లాలు,2000 గ్రామాల నుంచి జనసైనికులు వచ్చి ఈ భారీ కవాతులో పాల్గొంటారు అన్నట్టుగా అద్భుతమైన వీడియోను తీర్చిదిద్దారు.