పవన్ కళ్యాణ్ పై మహేష్ బాబాయ్ సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, January 24th, 2018, 01:50:23 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత ఘట్టమనేని ఆది శేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి మరియు జనసేన పార్టీ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓ కామెడీ ఎపిసోడ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ క్లయం మాట్లాడే వ్యాఖ్యల్లో అర్థం ఉండదు. తోలుబొమ్మలాటలో కేతిగాడు వచ్చినట్లు మధ్య మధ్యలో వచ్చి పోతుంటారు.

పవన్ కళ్యాణ్ బయటకు రావాలంటే చంద్రబాబు బటన్ నొక్కాలి. టీడీపీకి అవసరమైనప్పుడల్లా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమవుతుంటారు. ఇంతవరకు ఒక్క సమస్య గురించి కూడా పవన్ కళ్యాణ్ సరైన సమయంలో స్పందించలేదని అన్నారు. తెలుగు దేశం పార్టీ చేసే తప్పులన్నీ తమకు ప్లస్ గా మారుతాయని అన్నారు.

జగన్ చేసే పాదయాత్ర వలన వైసిపి వచ్చే ఎన్నికల్లో 125 స్థానాలు సాధించడం ఖాయం అని అన్నారు. గత ఎన్నికల్లో కృష్ణ, గుంటూరు మరియు గోదావరి జిల్లాల్లో పార్టీకి ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. ఈ సారి ఆ పరిస్థితి రానివ్వం అని అన్నారు.2019 లో జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అని అన్నారు.