ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పవన్..ముద్రగడతో ఫస్ట్ మీటింగ్..!

Friday, January 19th, 2018, 06:19:38 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వర్గాలకు కూడా అంతుచిక్కని ట్విస్ట్ ఇచ్చారు. చలోరే చల్ టూర్ తరువాత సైలెంట్ గా ఉండిపోయిన పవన్ కళ్యాణ్ మిగిలిన రాజకీయ పార్టీలు ఉలిక్కిపడేలా పొలిటికల్ మీటింగ్ ని సెట్ చేశారు. తాజాగా జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య మరియు ఇతర నేతలు ముద్రగడతో ఆయన సొంత గ్రామం కిర్లం పూడిలో భేటీ అయ్యారు. ఇది నిజంగా అనూహ్యమనే చెప్పాలి. కుల రాజకీయాలని ఇప్పటివరకు దూరం పెడుతూ వచ్చిన జనసేనాని ముద్రగడ మద్దత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దాదాపుగా ఐదు గంటల పాటు జనసేన కార్యకర్తలు ముద్రగడ పద్మనాభం తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్రలని ఎదుర్కొనేందుకు పవన్ సిద్ధం అయ్యాడనే సంకేతాలు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి తలనొప్పిగా మారిన ముద్రగడ వైసిపి కోవర్ట్ అనే ఆరోపణలు టీడీపీ నుంచి వినిపించాయి. వైసీపీ కూడా ముద్రగడకు మద్దత్తు తెలిపింది. ఈ నేపథ్యంలో జనసేనతో ముద్రగడ చర్చలు సఫలం అయితే ఆ రెండు పార్టీలకు మరింత చిక్కులు తప్పవని అంచనాలు మొదలయ్యాయి. ముద్రగడతో జరిపిన చర్చలు సారాంశాన్ని జనసేన నేతలు గోప్యంగా ఉంచారు. పవన్ కళ్యాణ్ వేయబోయే ఊహా తీతమైన ఎత్తుగడలు మునుముందు ఉన్నాయని ఏపీ పాలిటిక్స్ లో చర్చ మొదలైపోయింది.