వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన జనసేన ?

Monday, April 30th, 2018, 09:45:25 AM IST

వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన పార్టీ స్పష్టత ఇచ్చింది. 2019 లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ఇప్పటికే కార్యకర్తలతో చర్చించామని అన్నారు. లక్షలాదిమంది యువత పవన్ కళ్యాణ్ తో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ ఏడాది ఆగస్టు లోగా పవన్ కళ్యాణ్ జనసేన మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలిపారు. జనసేన పార్టీ దిశా నిర్దేశనం చేస్తారని అయన అన్నారు. మొత్తానికి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఏదైనా పార్టీ తో పొత్తు పెట్టుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments