జనసేన ప్రభావం పై రిపోర్ట్?

Friday, January 26th, 2018, 03:58:36 AM IST

ప్రస్తుత రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠ గా మారుతున్నాయి. అందునా ఆంధ్ర లో అధికారమే పరమావధిగా అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో అధికార టిడిపి మరియు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లు రెండిటి మధ్య వున్న సీట్ల తేడా మరీ ఎక్కువేం కాదు అనే చెప్పాలి. టిడిపి కి కేంద్ర బిజెపి, పవన్ కళ్యాణ్ ల మద్దతు కొంత మేరకు కలిసి వచ్చినట్లే కనిపించింది, అలా అని టిడిపి ని పూర్తి గా తీసేయలేము. మొదటి నుండి ఆ పార్టీ కి కొంత కోటరి ఉండనే వుంది. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోరాడి 67 స్థానాలు కైవశం చేసుకుంది. అయితే అప్పటి పరిస్థితుల్లో పవన్ తన జనసేన పార్టీ ని టిడిపి కి మద్దతు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆయన పార్టీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో పరిస్ధితి కొంత ఉత్కంఠగానే వుంది. పైగా టిడిపి కూడా మునిసిపల్ ఎలెక్షన్లలో పవన్ సాయం లేకుండా గెలిచిందిగా అనేది గుర్తుపెట్టుకోవాలి కొందరు అంటున్నారు. ప్రస్తుతం జగన్ పార్టీ కూడా ఒంటరిగానే వెళ్తుందా లేక మరే పార్టీ తో అయినా పోతు పెట్టుకుంటుందో కొన్నాళ్ళు ఆగితే కానీ తెలియదు. అయితే అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా జనసేన పై ప్రజల నాడిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని, తదనుగుణంగా తమ లోటుపాట్లను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియవస్తోంది. పవన్ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తోందనేది నిజం. కొత్తగా పుట్టిన పార్టీ కాబట్టి జనాల్లో నలగాలంటే మరికొంత సమయం పట్టవచ్చని, పవన్ కూడా అవకాశం వున్నంతవరకు అధికారం కోసం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరిగే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ పుట్టింది అధికారం కోసం కాదని, అధికారం లో వున్నవారు ప్రజా కార్యక్రమాల అమలులో అవకతవకలకు పాల్పడితే ప్రశ్నించడానికే తమ ప్రాధాన్యం ఆయన ముందునుండి చెప్తున్నారు. పవన్ తాను అనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నట్లు ఇదివరకే తెలిపారు అయితే దీని పై మరికొంత స్పష్టత రావలసి వుంది. ప్రస్తుతం పరిస్థితులని బట్టి చూస్తే పవన్ రానున్న ఎన్నికల్లో కింగ్ అవుతారో, లేక కింగ్ మేకర్ అవుతారో అనేది వెనువెంటనే చెప్పలేమని, ఏది ఏమైనప్పటికి పవన్ పార్టీ ప్రవేశంతో ఈ సారి ఎన్నికలు కొంత ఉత్కంఠగానే సాగనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.