జనసేన అభిమానులకు ఎమోషనల్ అప్పీల్ !

Friday, January 19th, 2018, 08:06:32 PM IST

ఇటీవల జనసేన పార్టీ అభిమానులని, కార్యకర్తలని గందరగోళంలోకి నెట్టే డిబేట్లని కొన్ని న్యూస్ ఛానల్స్ చేస్తుండడంతో ఆ పార్టీ అలెర్ట్ అయింది. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి తాజాగా అభిమానులకు ఎమోషనల్ అప్పీల్ చేశారు. సామజిక మాధ్యమం ద్వారా ఆయన ఓ లేఖని విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అభిమానులు ఎవరూ సంయమనం కోల్పోవద్దని సూచించారు. జరుగుతున్న పరిణామాలని ఆయన రాజకీయ కుట్రలుగా అభివర్ణించారు. నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం లో ఉన్న జనసేన పార్టీని ఎదగనీయకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. వాటన్నింటిని సహనంతోనే ఎదుర్కొనాలని మహేందర్ రెడ్డి జన శ్రేణులని కోరారు.

జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా అంతా పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవాలని కోరారు. కువిమర్శలు చేసే వారిపట్ల రియాక్ట్ కాద్దని కోరారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకునివెళ్ళాలని తెలిపారు. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తదుపరి వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది.