ట్విట్టర్ లో పవన్, ఆసుపత్రిలో ఫాన్స్ ..దున్నేస్తున్నారు..!

Sunday, November 27th, 2016, 03:30:58 PM IST

janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీ పెద్ద నోట్ల రద్దు పై ట్విట్టర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తోందని పవన్ అన్నారు. బ్యాంకుల వద్ద ఏటీఎం ల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన తెలియజేసారు. కర్నూలులో మూడు రోజులుగా బ్యాంకు భుట్టో తిరిగి డబ్బులు దొరకక బ్యాంకు వద్దే ప్రజలు కోల్పోయిన బాలరాజు గారి కుటుంబానికి పవన్ సంతాపం వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యం లో దేవం లోని రాష్ట్రం లోని బిజెపి ఎంపీలకు గట్టిగానే చురకలు అంటించారు. బ్యాంకుల వద్ద ఏటీఎం వద్ద బలరాజుగారి లాంటి సామాన్యులు మాత్రమే ఉంటున్నారని బడా నేతలు ఎంపీ లు ఎవరూ లేరని పవన్ పరోక్షంగా విమర్శించారు.

పెద్ద నోట్ల రద్దు వలన దేశంలో బాలరాజు గారి లాంటి సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనివల్ల ప్రజలలో భయం నెలకొని ఉందని వారికి ధైర్యం కలిగించేలా ఎంపీలందరూ ఏటీఎం వద్ద బ్యాంకుల్లో క్యూ లో నిలబడాలని పరోక్షంగా బిజెపి నేతలకు చురకలు అంటించారు. పవన్ ట్విట్టర్ వేదికా పెద్ద నోట్ల రద్దుపై స్పందిస్తుంటే.. పవన్ ఫాన్స్ మాత్రం పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు వారివంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శని ఆదివారాల్లో బ్యాంకులు ఉండని పక్షం లో నిమ్స్ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడకుండా వారికీ తగిన సాయం చేస్తున్నారు. ఆదివారం జనసేన కార్యకర్తలు ఆసుపత్రిలో మందులు, పండ్లు పంపిణి చేశారు.రోగులవద్ద ఉన్న పాత నోట్లని తీసుకుని వారికి కొత్త నోట్లని అందించారు.